Maharashtra: ఢిల్లీ, మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా

Growth in Corona cases in Maharashtra and Delhi
  • మహారాష్ట్రలో 3,827, ఢిల్లీలో 3,137 కేసులు నమోదు
  • 15 రాష్ట్రాల్లో వందల సంఖ్యలో వెలుగు చూస్తున్న కేసులు
  • తగ్గుతున్న కేసుల వృద్ధిరేటు
మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 3,827, ఢిల్లీలో 3,137 కేసులు నమోదయ్యాయి.  ఫలితంగా మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 1.24 లక్షలకు చేరుకోగా, ఢిల్లీలో 53,116 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 69.13శాతం కేసులు నమోదు కాగా, 82.63 శాతం మరణాలు నమోదు కావడం గమనార్హం. మరో 15 రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండగా, 9 రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో నమోదయ్యాయి.

మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వాటి వృద్ధి రేటు క్రమంగా తగ్గుతుండడం కొంత ఊరట కలిగించే అంశం. నాలుగు వారాల క్రితం ఇది 5.6 శాతంగా ఉండగా, నిన్న ఇది 3.8 శాతానికి తగ్గింది. అలాగే, రికవరీ రేటు కూడా నాలుగు వారాల్లో గణనీయంగా పెరిగింది. 41.4 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 54.12 శాతానికి పెరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే, మరణాల రేటు మాత్రం మూడు నుంచి 3.3 శాతానికి పెరగడం గమనార్హం.
Maharashtra
New Delhi
Corona Virus

More Telugu News