Telangana: తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా... ఒక్కరోజే 546 కేసులు

Huge spike in Telangana corona cases in a single day
  • జీహెచ్ఎంసీ పరిధిలో 458 మందికి కరోనా నిర్ధారణ
  • తాజాగా ఐదుగురి మృతి
  • 203కి పెరిగిన కరోనా మరణాలు
కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. తాజాగా 3,188 నమూనాలు పరీక్షించగా, 546 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలకు చెందినవారే 458 వరకు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,072 కాగా, ఇప్పటివరకు 3,506 మంది డిశ్చార్జి అయ్యారు. 3,363 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, గత 24 గంటల్లో తెలంగాణలో ఐదుగురు మరణించగా, కరోనా మృతుల సంఖ్య 203కి పెరిగింది. తాజాగా 154 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Telangana
Corona Virus
Positive
Deaths
GHMC
Hyderabad
COVID-19

More Telugu News