Guidelines: కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు

New set of guidelines issued for Telangana government employs
  • తెలంగాణలో అధికమవుతున్న కరోనా కేసులు
  • కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది హాజరుకావాలంటూ స్పష్టీకరణ
  • 50 శాతం సిబ్బంది రొటేషన్ లో పనిచేయాలని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను దృష్టిలో ఉంచుకుని నూతన నిబంధనావళి రూపొందించారు. ఈ మార్గదర్శకాలు జూన్ 22 నుంచి జూలై 4 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం... ఇకపై, ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది హాజరు కావాలి. 50 శాతం సిబ్బంది రొటేషన్ విధానంలో పనిచేయాలి. గర్భవతులు, వివిధ వ్యాధులతో బాధపడేవారు సెలవులను వాడుకోవాలి.

ఆఫీసుల్లో ప్రత్యేకంగా చాంబర్లు ఉన్నవారు ప్రతిరోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల అనుమతి ఉంటే తప్ప సందర్శకులను ఆఫీసుల్లోకి అనుమతించరాదు. అధికారులు ఉపయోగించే వాహనాల డ్రైవర్లు పార్కింగ్ లో కాకుండా ఇకపై పేషీలో ఉండాలి. తెలంగాణ సచివాలయం ఉన్న బీఆర్కే భవన్ లో కరోనా తీవ్రత దృష్ట్యా నాలుగో తరగతి ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Guidelines
Employs
Government
Telangana
Corona Virus

More Telugu News