Vijayasai Reddy: ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎల్లప్పుడూ అవరోధాలు సృష్టిస్తూనే ఉంటాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy terms Chandrababu a Swindler
  • ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తిన విజయసాయి
  • చంద్రబాబువి దుష్టచర్యలు అంటూ విమర్శలు
  • దారుణమైన మోసగాడు అంటూ వ్యాఖ్యలు
  • ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని వెల్లడి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధికి ఎల్లప్పుడూ ఆటంకాలు సృష్టిస్తుంటాడని ఆరోపించారు. చంద్రబాబు చర్యలే అతనిలోని దుష్టస్వభావాన్ని బయటపెడుతుంటాయని వివరించారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడనటువంటి దారుణమైన మోసగాడు  అంటూ మండిపడ్డారు. అవసరంలో ఉన్న పేదలకు సంక్షేమ ఫలాలు అందకుండా ఉన్మాదంతో వ్యవహరించే చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ క్షమించలేరని విజయసాయి ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Chandrababu
Swindler
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News