AL Raghavan: తమిళ సినీ దిగ్గజ గాయకుడు, నటుడు ఏఎల్ రాఘవన్ కన్నుమూత

Legendary singer AL Raghavan passes away
  • కార్డియాక్ అరెస్ట్‌తో మృతి
  • దిగ్గజ గాయకులతోనూ కలిసి పాడిన రాఘవన్
  • ఎన్టీఆర్ ‘నిండుమనసులు’, ‘నేనే మొనగాణ్ణి’, ‘కులగౌవరం’లోనూ పాడిన వైనం

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు ఏఎల్ రాఘవన్ (80) నిన్న కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన ఆయనను భార్య ఎంఎన్ రాజం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని రాయపేటలోని నివాసానికి తరలించారు.

1947లో గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాఘవన్ వేలాది పాటలు పాడారు. చివరిగా 2014లో విడుదలైన ఆడమా జైచోమాడ చిత్రంలో సీన్ రోల్డాన్ సంగీత సారథ్యంలో 'నల్లా కేతుక్కా పాదం' అనే పాట పాడారు. నెంజిల్ ఒరు ఆలయంలో రాఘవన్ పాడిన ‘ఎంకిరుంతాళం వాళ్గా’ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  

లెజండరీ సంగత దర్శకులైన కేవీ మహదేవన్, ఎస్‌ఎం సుబ్బానాయుడు, ఘంటసాల, విశ్వనాథ్‌-రామ్మూర్తి, టీవీ రాజు, ఎస్‌పీ కోదండపాణిలాంటి వారితో కలిసి పనిచేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, జిక్కి, పి.లీల వంటి ప్రముఖ గాయకులతో కలిపి ఎన్నో పాటలు పాడారు. ఎన్టీఆర్ నటించిన  ‘నిండు మనసులు’, ‘నేనే మొనగాణ్ణి’ చిత్రాల్లో పాటలు పాడారు. ‘కులగౌరవం’ సినిమాలో ‘హ్యాపీ లైఫ్’‌ అంటూ సాగే  పాట‌ను ఎల్‌.ఆర్‌.ఈశ్వరితో పాడారు.

  • Loading...

More Telugu News