Vijay Sai Reddy: దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన లోకేశ్ కు విలువలు తెలుస్తాయని ఆశించడం అత్యాశే: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy take a dig at Nara Lokesh
  • లోకేశ్ లో క్రమశిక్షణ లేదన్న విజయసాయి
  • మంత్రులపైకి ఎమ్మెల్సీలను ఉసిగొల్పాడంటూ ఆరోపణలు
  • వీడియోలు తీసి ఎల్లోమీడియాకు పంపాడంటూ ట్వీట్
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన లోకేశ్ కు క్రమశిక్షణ, సభ విలువలు తెలుస్తాయని ఆశించడం అత్యాశే అవుతుందని వ్యాఖ్యానించారు. శాసనమండలి సమావేశాల్లో జరిగిన రభసను దృష్టిలో ఉంచుకుని విజయసాయి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఖరి సమావేశం అనుకున్నాడేమో మంత్రులపైకి ఎమ్మెల్సీలను ఉసిగొల్పి వీడియోలు తీసి ఎల్లోమీడియాకు పంపించాడని ఆరోపించారు. ఒకటి మాత్రం నిజం... శాసనసభలోకి ఎప్పటికీ అడుగుపెట్టలేవు అంటూ లోకేశ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
Nara Lokesh
AP Legislative Council
AP Assembly Session
Telugudesam
YSRCP

More Telugu News