Corona Virus: ఏపీలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా అప్ డేట్స్ ఇవిగో!

In last 24 hours 376 people tests corona positive
  • 24 గంటల్లో కొత్తగా 376 కేసులు
  • కరోనా కారణంగా ముగ్గురి మృతి
  • 6,230కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 17,609 శాంపిల్స్ సేకరించగా, ఏకంగా 376 కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,230కి చేరుకుంది. ఇప్పటి వరకు 3,065 మంది డిశ్చార్జి అయ్యారు. 3,069 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మొత్తం 96 మంది మరణించారు.

Corona Virus
Andhra Pradesh
Cases

More Telugu News