East Godavari District: తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరి ద్వారా 222 మందికి కరోనా

222 persons infected by only one person in east godavari dist
  • గత నెల 21న గొల్లల మామిడాడలో తొలి కేసు
  • గ్రామంలో ఇప్పటి వరకు 119 మందికి కరోనా
  • రాయవరం మండలంలో మరో 57 మందికి సోకిన మహమ్మారి
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరి ద్వారా ఏకంగా 222 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గత నెల 21న తొలి పాజిటివ్ కేసు నమోదైంది. ఆ తర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. ఇప్పటి వరకు 222 మందికి వైరస్ సంక్రమించింది. ఒక్క మామిడాడలోనే ఏకంగా 119 మంది వైరస్ బారినపడడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే, పెదపూడి మండలంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 125కు పెరిగింది. మామిడాడలో నమోదైన తొలి కేసు ద్వారా రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ పరిధిలోని సూర్యారావుపేటలో 57 మందికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. మామిడాడలో నమోదైన తొలి కేసు ద్వారానే వీరందరికీ సంక్రమించినట్టు అధికారులు పేర్కొన్నారు.
East Godavari District
Gollala mamidada
Corona Virus

More Telugu News