Maharashtra: పూణెలో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

four members in one family suicide in pune
  • పిల్లలకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య
  • ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్న పోలీసులు
  • విషాదంలో సుఖ్‌సాగర్
మహారాష్ట్రలోని పూణెలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నగరంలోని సుఖ్‌సాగర్‌కు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలకు ఉరివేసిన అనంతరం వారు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం వారు నలుగురు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో సుఖ్‌సాగర్ ప్రాంతంలో విషాదం నెలకొంది.
Maharashtra
pune
family
suicide

More Telugu News