Rajinikanth: రజనీకాంత్ ఇంట్లో బాంబు ఉందంటూ ఆగంతుకుడి ఫోన్ కాల్... చెన్నైలో కలకలం

Bomb in Rajinikanth house prank phone call makes Chennai police alert
  • రజనీ ఇంట్లో బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు
  • బాంబు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
  • ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు
చెన్నైలో ఇవాళ బాంబు కలకలం రేగింది. అది కూడా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందంటూ ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు పరుగులు తీశారు. ఆగంతుకుడి నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసు బృందాలు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ తో కలిసి రజనీ ఇంటికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన శునకాలు, మెటల్ డిటెక్టర్ల సాయంతో సూపర్ స్టార్ నివాసాన్ని అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరికి ఎలాంటి బాంబు లేదని తెలియడంతో వాతావరణం తేలికపడింది. ఆపై, పోలీసులు తప్పుడు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిపై దృష్టి సారించారు. కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై ఆరా తీసి, ఆ వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
Rajinikanth
Bomb
Prank
Phone Call
Police
Chennai

More Telugu News