Chandrababu: మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల పోరాటం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: చంద్రబాబు

TDP President Chandrababu talks with party leaders via online
  • పార్టీ నేతలతో చంద్రబాబు ఆన్ లైన్ సమావేశం
  • మంత్రుల దాడులు తట్టుకుని పోరాడారంటూ ఎమ్మెల్సీలకు అభినందన
  • ఉన్మాదిపై పోరాటంలో అప్రమత్తంగా ఉండాలని సూచన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజా పరిణామాలపై పార్టీ నేతలతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల పోరాటం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. వైసీపీ మంత్రుల దాడులను తట్టుకుని ఎమ్మెల్సీలు పోరాటం సాగించడం అభినందనీయం అన్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం వంటి అంశాలను లెక్కచేయకుండా తమ ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరయ్యారని ప్రశంసించారు. ఇదే పోరాట స్ఫూర్తి భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, రాష్ట్ర ప్రయోజనాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ ప్రలోభాలకు లొంగిన కొందరు చరిత్రహీనులయ్యారని, ఉన్మాదిపై పోరాటంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండలి సమావేశాల గురించి మాట్లాడుతూ, సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ తెచ్చారని, రూల్ 90 కింద చర్చించాలని కోరితే దాడులకు దిగారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలా? లేక, రాజధాని తరలింపు సమావేశాలా? అంటూ ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లును ఎవరు ఆపారో వీడియోలు, రికార్డులు చూస్తే బయటపడుతుందని అన్నారు.
Chandrababu
MLC
Telugudesam
TDP
YSRCP
Minister
Andhra Pradesh

More Telugu News