Niharika: నిహారిక పోస్ట్ చేసిన ఆసక్తికరమైన ఫొటో.. 'పెళ్లి'పై నెటిజన్ల ప్రశ్నలు

niharika about her marriage
  • స్టార్ బక్స్ కాఫీ కప్ మీద 'మిస్ నీహ' అని రాసిన నిహారిక
  • అందులో మిస్‌ను కొట్టేసిన వైనం
  • 'మిసెస్' అని రాసిన సినీనటి
నాగబాబు కూతురు, సినీ నటి నిహారిక పెళ్లి గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. నిహారికకు త్వరలో పెళ్లి చేస్తామని ఇటీవల నాగబాబు కూడా ప్రకటించారు. ఇటువంటి సమయంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అందులో స్టార్ బక్స్ కాఫీ కప్ మీద 'మిస్ నీహ' అని రాసి ఉంటుంది.
                    
అయితే, దానిలో 'మిస్‌' పదాన్ని కొట్టేసి దాని కిందే 'మిసెస్' అని నిహారిక రాసింది. దీంతో నిహారిక పెళ్లిపై మరోసారి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వరుడు ఎవరని ఆమెను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? ఎవరితో అంటూ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నిహారిక పెళ్లిని ఎవరితోనో నిశ్చయం చేశారని చర్చ కొనసాగుతోంది.
Niharika
nagababu
Tollywood
marriage

More Telugu News