Narendra Modi: మరో లాక్ డౌన్ లేనట్టే... కేసీఆర్ ప్రశ్నకు ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోదీ!

No more lockdown says Modi
  • మరో లాక్ డౌన్ ఉండబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • దీనిపై క్లారిటీ ఇవ్వాలని మోదీని కోరిన కేసీఆర్
  • నాలుగు దశల లాక్ డౌన్ ముగిసిందన్న మోదీ
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు.

దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోందని కేసీఆర్ అన్నారు. ప్రధాని మీడియాతో మాట్లాడబోతున్నారనే విషయం తెలియగానే లాక్ డౌన్ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారని చెప్పారు. అయితే... ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా ప్రధాని అలాంటి ప్రకటన చేయరని తాను అందరికీ చెబుతున్నానని ప్రధానికి తెలిపారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని మోదీని కోరారు.

దీనిపై మోదీ స్పందిస్తూ... దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసిందని, అన్ లాక్ 1.0 నడుస్తోందని చెప్పారు. అన్ లాక్ 2.0ని ఎలా అమలు చేయాలనే దానిపై అందరం చర్చించుకోవాలని అన్నారు.

Narendra Modi
BJP
KCR
TRS
Lockdown

More Telugu News