Anushka Shetty: మరోసారి వైరల్ అవుతున్న అనుష్క పెళ్లి వార్తలు

Anushka marriage news are going viral in social media
  • ప్రకాశ్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం
  • వివాహం దాదాపు ఖరారైందని టాలీవుడ్ సర్కిల్ లో టాక్
  • త్వరలోనే ఎంగేజ్మెంట్ అని ప్రచారం
టాలీవుడ్ లో హీరోయిన్ అనుష్క పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు మరెవరిపై కూడా వచ్చి ఉండవు. ప్రభాస్, అనుష్క పెళ్లంట అనే వార్త చాలా కాలం చక్కర్లు కొట్టింది. తమ మధ్య అలాంటిదేమీ లేదని వారిద్దరూ డైరెక్ట్ గా ప్రకటన చేసినా... ఆ వార్త మాత్రం ఆగలేదు. ఆ తర్వాత ఓ క్రికెటర్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతోందనే వార్త వైరల్ అయింది. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ ని పెళ్లాడబోతోందనే వార్త ప్రచారమైంది. ఈ వార్తలను కూడా అనుష్క కొట్టిపడేసింది. అయితే, ఇప్పుడు మళ్లీ ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

ప్రకాశ్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతోందని... ఈ వార్త ముమ్మాటికీ నిజమని టాలీవుడ్ సర్కిల్స్ లో అంటున్నారు. వీరి వివాహం దాదాపు ఖరారైందని చెపుతున్నారు. అనుష్క చేతిలోని సినిమాలు పూర్తి కాగానే వివాహం జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనుందని సమాచారం.
Anushka Shetty
Marriage
Tollywood

More Telugu News