Nara Lokesh: జగన్ వంటి కుర్రకుంకలను ఎంతో మందిని అయ్యన్న చూశారు: లోకేశ్

Lokesh Slams Jagan
  • ఏడాదిలో 7 కేసులు పెట్టారు
  • అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ కేసులు
  • ట్విట్టర్ లో నారా లోకేశ్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు కావడంపై నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "అయ్యన్నపాత్రుడు గారిది 37 ఏళ్ల మచ్చలేని రాజకీయ జీవితం. 10 శాఖలకు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం.  వైఎస్ జగన్ గారితో కలిపి 10 మంది ముఖ్యమంత్రులను చూసిన అనుభవం. ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో సేవ చేసిన సీనియర్ నేత" అని అన్నారు. ఆపై "అలాంటి నేతపై ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ జగన్ ప్రభుత్వం 7 కేసులు పెట్టింది. జగన్ పాలన ఎలా ఉంది అంటే ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే చాలు అర్ధం అవుతుంది. జగన్ గారి లాంటి కుర్రకుంకలను చాలా మందినే చూసి ఉంటారు అయ్యన్నగారు" అని అన్నారు.
Nara Lokesh
Twitter
Jagan
Ayyanna Patrudu

More Telugu News