Vivek Oberoy: సుశాంత్ అంత్యక్రియల వద్ద దృశ్యాలు చూశాక నా హృదయం బద్దలైంది: వివేక్ ఒబెరాయ్

Vivek Oberoi comments after Sushants funerals
  • సుశాంత్ తండ్రి కళ్లలోని బాధను చూడలేకపోయా
  • అతని సోదరి రోదనలను వర్ణించలేను
  • ఈగోలను బాలీవుడ్ పక్కన పెట్టేయాలి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు ముంబైలోని శ్మశానవాటికలో ముగిశాయి. ఈ కార్యక్రమానికి వివేక్ ఒబెరాయ్, కృతి సనన్, రణదీప్ హుడా, ముఖేశ్ చబ్రా, శ్రద్ధా కపూర్ తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. భారీ వర్షంలో తడుస్తూ వారంతా సుశాంత్ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన హృదయవిదారకమైన ఘటనను వివేక్ ఒబెరాయ్ పంచుకున్నాడు.

సుశాంత్ అంత్యక్రియల వద్ద దృశ్యాలు చూశాక, తన హృదయం బద్దలైందని వివేక్ ఒబెరాయ్ అన్నారు. సుశాంత్ తండ్రి కళ్లలోని బాధను చూడలేకపోయానని అన్నారు. కుమారుడికి నిప్పు పెడుతున్నప్పుడు ఆయన కళ్లలో కనిపించిన నొప్పి భరించలేనిదని చెప్పారు. సుశాంత్ వెనక్కి వచ్చేయ్ అంటూ అతడి సోదరి రోదనలను వర్ణించలేనని అన్నారు.

తాను కూడా ఒంటరితనాన్ని భరించానని, కానీ దానికి చావు సమాధానం కాదని వివేక్ ఒబెరాయ్ తెలిపారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానుల గురించి ఆలోచించి ఆత్మహత్యకు పాల్పడకుండా ఉంటే బాగుండేదని చెప్పారు.

జరుగుతున్న పరిణామాలను ఇప్పటికైనా ఇండస్ట్రీ గమనిస్తుందని ఆశిస్తున్నానని... అందరం ఇప్పటికైనా ఉన్నతంగా మారాలని అన్నారు. ఈగోలను పక్కన పెట్టేయాలని కోరారు. నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహించాలని చెప్పారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సుశాంత్ ను మిస్ అవుతున్నానని అన్నారు. నీతో ఉండే అర్హత మాకు లేదేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నీవు సరైన చోటులో ఉన్నావని భావిస్తున్నానని చెప్పారు. నీవు లేని లోటును భరించే శక్తిని కుటుంబసభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
Vivek Oberoy
Sushant Singh Rajput
Bollywood

More Telugu News