Santosh: చైనాతో సరిహద్దు ఘర్షణలో చనిపోయిన వారిలో తెలుగు కల్నల్

Telugu colonel dies of clash between India and China soldiers
  • లడఖ్ వద్ద నిన్న రాత్రి భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ
  • కల్నల్ ర్యాంకు అధికారి బి.సంతోష్ మృతి
  • సంతోష్ స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట
లడఖ్ లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగ్గా, భారత్ కు చెందిన ఓ సైనికాధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికాధికారి తెలుగువాడేనని తెలిసింది. ఆయన పేరు బి. సంతోష్. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ భారత ఆర్మీలో కల్నల్ ర్యాంకు అధికారి. బాధాకరమైన విషయం ఏమిటంటే... సంతోష్ కు ఇటీవలే హైదరాబాద్ రెజిమెంట్ కు బదిలీ అయింది. కానీ హైదరాబాద్ వచ్చే లోపే ఆయన అమరుడు కావడం విషాదకరం. ఆర్మీ అధికారులు సంతోష్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Santosh
Colonel
Army
India
China
Ladakh

More Telugu News