Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు.. జూలై 1న భూమి పూజ!

Bhoomi Puja for Ayodhya Ram temple on July 1
  • పూర్తయిన భూమి చదును పనులు
  • భూమి పూజ చేయనున్న యోగి
  • ఢిల్లీలో ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. లాక్ డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో పనులు పుంజుకున్నాయి. ఆలయానికి సంబంధించిన 70 ఎకరాల్లో భూమిని చదును చేశారు. జూలై 1వ తేదీన భూమి పూజను నిర్వహించేందుకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లను చేస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భూమి పూజను చేయనున్నారు. ప్రధాని మోదీని ఫిబ్రవరిలోనే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే, ఆయన హాజరు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెపుతున్నారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని సమాచారం. పూజలు నిర్వహించి, ఓ పునాది రాయిని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా ద్వారా అయోధ్యకు పంపిస్తారు. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మిశ్రా భూమి పూజలో పాల్గొంటారు.
Ayodhya Ram Mandir
Temple
Bhoomi Pooja

More Telugu News