Army: రాళ్లతో దాడి చేసుకున్నారు... ముగ్గురు చైనా సైనికులు కూడా చనిపోయారు: భారత ఆర్మీ

Indian Army responds on Galwan Valley face off
  • లడఖ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • గతరాత్రి గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణ
  • ముగ్గురు భారత సైనిక సిబ్బంది మృతి
  • చైనా సైనికులే రెచ్చగొట్టారన్న భారత సైన్యం
లడఖ్ వద్ద కొన్ని వారాలుగా భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఇరుదేశాల ఉన్నతస్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినా లడఖ్ వద్ద పరిస్థితులు చక్కబడలేదు సరికదా, గతరాత్రి జరిగిన దాడి ఘటనతో మరింత వేడెక్కాయి. గాల్వన్ లోయ వద్ద జరిగిన దాడి ఘటనపై భారత ఆర్మీ స్పందించింది.

 గత రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని వెల్లడించింది. ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు చైనా సైనికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మన సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత ఆర్మీ ఆరోపించింది.
Army
India
china
Galwan Valley
Ladakh

More Telugu News