Vijay Sai Reddy: లోకేశ్ ను మాలోకం అనేది అందుకే: విజయసాయి రెడ్డి

Vijaya Sai Reddy Setires on Lokesh
  • అమాయకత్వం నటిస్తున్న లోకేశ్
  • జేసీ కుటుంబాన్ని తిట్టడానికే పర్యటన
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్, నిన్న అనంతపురం జిల్లాలో జరిపిన పర్యటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "లోకేశ్ ను మాలోకం అనేది అందుకే. జేసీ కుటుంబాన్ని ఓదార్చడానికెళ్లాడా, వీళ్లు తక్కువోళ్లు కాదు, శాస్తి జరిగింది అని తిట్టడానికి వెళ్లాడా?  వీడియో క్లిప్పింగ్ చూస్తే ఇదే అనుమానం వస్తుంది.

తనను, తండ్రిని కూడా అరెస్టు చేస్తారేమో అని అమాయకత్వం నటించాడు. చేసిన స్కాములు ఒకటా రెండా" అంటూ విమర్శలు గుప్పించారు. కాగా, బస్సుల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి, కడప జైలుకు తరలించిన తరువాత, లోకేశ్ వారి కుటుంబాలను పరామర్శించిన సంగతి తెలిసిందే.
Vijay Sai Reddy
Nara Lokesh
Twitter
JC Prabhakar Reddy

More Telugu News