Mohan Babu: ఆ రోజు రజనీకాంత్ రాజమండ్రి వచ్చి నాకు ఆర్థికసాయం అందించాడు: మోహన్ బాబు

Mohan Babu reveals how Rajinikanth helped him during Pedarayudu shooting
  • పెదరాయుడు చిత్రానికి నేటితో పాతికేళ్లు
  • ఈ సందర్భంగా రజనీకాంత్ గురించి చెప్పిన మోహన్ బాబు
  • రూ.45 లక్షలు తీసుకుని రాజమండ్రి వచ్చాడని వెల్లడి
పెదరాయుడు చిత్రం విడుదలై నేటికి పాతికేళ్లయిన సందర్భంగా సీనియర్ నటుడు మోహన్ బాబు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. పెదరాయుడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన రజనీకాంత్ పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, పైగా తనకే ఆర్థికసాయం అందించాడని తెలిపారు.

పెదరాయుడు చిత్రం షూటింగ్ అత్యధిక భాగం తూర్పు గోదావరి జిల్లాలో జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుతున్న సమయంలో తాను ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నానని, ఈ విషయం తెలిసిన రజనీకాంత్ రూ.45 లక్షలతో రాజమండ్రి వచ్చి తనను ఆదుకున్నాడని వివరించారు. సినిమా రిలీజ్ అయ్యాకే ఆ డబ్బు తిరిగివ్వమని పెద్దమనసు చాటుకున్నాడని గుర్తు చేసుకున్నారు. రజనీకాంత్ వంటి స్నేహితుడు ఉన్నందుకు గర్విస్తున్నానని తెలిపారు.
Mohan Babu
Rajinikanth
Help
Rajamandri
Pedarayudu
Shooting

More Telugu News