Kangana Ranaut: తల్లి నేర్పిన మాటలను సుశాంత్ మర్చిపోయాడు... వాళ్లను నమ్మాడు: కంగన

Bollywood actress Kangana Ranaut reacts over Sushant Singh Rajput suicide issue
  • సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య
  • సుశాంత్ మృతిపై మీడియాను ప్రశ్నించిన కంగన
  • అతడు బలహీన మనస్కుడని ఎలా చెబుతారంటూ ఆగ్రహం
ఎంఎస్ ధోనీ బయోపిక్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ చీకటికోణాలపై కథనాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. కొందరు జర్నలిస్టులు సుశాంత్ డ్రగ్స్ వాడుతున్నాడని గతంలో రాశారని, వాళ్లకు సంజయ్ దత్ డ్రగ్స్ కు బానిసైన విషయం ఎంతో ముద్దొస్తుందని వ్యంగ్యంగా అన్నారు. సుశాంత్ చేసిన తప్పల్లా... "నువ్వు పనికిరావు" అని అవమానించిన వ్యక్తులను నమ్మడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర ఎవరు రాయాలన్న విషయం మనమే నిర్ణయించాలని తల్లి నేర్పిన మాటలను సుశాంత్ మర్చిపోయాడని చెబుతూ కంగన భావోద్వేగాలకు లోనయ్యారు.

సుశాంత్ ఆత్మహత్యకు కారణం బలహీనమైన మనస్తత్వమేని మీడియా చెబుతోందని, దేశం మొత్తమ్మీద ర్యాంక్ సాధించిన విద్యార్థి బలహీన మనస్కుడని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. అతడి తొలి సినిమా 'కై పో చే'ను ఎవరూ ఎందుకు ప్రోత్సహించలేదని, పరమచెత్తగా ఉన్న 'గల్లీబాయ్' సినిమాకు అన్ని అవార్డులు ఎలా లభించాయని కంగన ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ నటించిన 'చిచ్చోరే' అద్భుతంగా ఉన్నా, ఎందుకు ఎవరూ పట్టించుకోలేదని కంగన నిలదీశారు.
Kangana Ranaut
Sushant Singh Rajput
Media
Suicide

More Telugu News