rain: ఆసుపత్రి అత్యవసర వార్డులోకి వాన నీటి వరద.. వీడియో ఇదిగో

Rainwater entered the emergency ward
  • మహారాష్ట్రలో ఘటన
  • అత్యవసర వార్డులో 8 మంది రోగులు
  • వేరే వార్డుకి తరలింపు
  • తీవ్ర విమర్శలు
దేశంలో వైద్య సదుపాయాలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో తెలిపే విషయానికి ఈ వీడియోనే సాక్ష్యం. ఆసుపత్రిలోని అత్యవసర వార్డులోకి వాన నీటి వరద వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. జలగావ్‌లోని డాక్టర్ ఉల్హస్ పటేల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోకి వరదనీరు వచ్చింది.

ఆ సమయంలో ఇదే వార్డులో ఎనిమిది మంది రోగులు అత్యవసర  చికిత్స తీసుకుంటున్నారు. వారందరినీ సురక్షితంగా వేరే వార్డుకి పంపినట్లు ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. అత్యవసర వార్డులోకి ఇలా వరద నీరు రావడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
rain
Maharashtra

More Telugu News