Telugudesam: విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై.. వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి.. ఉద్రిక్తత

tdp mla attack by ycp
  • విశాఖలోని అరిలోవ 13వ వార్డులో ఘటన
  • అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన వెలగపూడి రామకృష్ణబాబు
  • రాళ్లతో వైసీపీ కార్యకర్తల దాడి
  • అక్కడే బైఠాయించి ఎమ్మెల్యే నిరసన
విశాఖలోని అరిలోవ 13వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో అక్కడి టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

దీంతో వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వైసీపీ మద్దతుదారుల తీరుకి నిరసనగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తమపై రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరగడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా వుంది.
Telugudesam
YSRCP
Vizag

More Telugu News