Nara Lokesh: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన నారా లోకేశ్

lokesh reaches jcs home
  • తాడిపత్రిలో పవన్‌ రెడ్డితో మాట్లాడిన లోకేశ్
  • కేసుల వివరాలు అడిగి తెలుసుకున్న యువనేత
  • ప్రస్తుతం రిమాండులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డి  
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుటుంబాన్ని ఆ పార్టీ నేత నారా లోకేశ్‌ ఈ రోజు ఉదయం పరామర్శించారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో ప్రభాకర్‌ రెడ్డితో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి గుత్తి మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లిన లోకేశ్‌ తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఈ కేసుకు సంబంధించిన వివరాలను పవన్‌ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

 కాగా,  ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డి 14 రోజుల రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వారిని కలిసేందుకు లోకేశ్‌కు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. కరోనా‌ నిబంధనల కారణంగా అనుమతులు ఇవ్వబోమని అధికారులు చెప్పారు.
Nara Lokesh
JC Prabhakar Reddy
Andhra Pradesh
Telugudesam

More Telugu News