Corona Virus: ఉద్యోగులకు కరోనా.. ముంబై, థానేలోని మూడు బ్రాంచీలను మూసేసిన ఎస్‌బీఐ

SBI Closes three branches in Mumbai amid corona virus fears
  • థానే బ్రాంచ్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్
  • మరో బ్రాంచ్‌లోని క్యాష్ ఆఫీసర్‌కు కూడా
  • అంధేరీ బ్యాంకులోని ఓ తోటమాలికి సోకిన వైరస్
మహారాష్ట్ర, థానేలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) మెయిన్ బ్రాంచ్‌లో ఏడుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడంతో బ్యాంకును మూసివేశారు. ఈ మేరకు సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఈ బ్రాంచ్‌లో మొత్తం 25 మంది పనిచేస్తున్నారు. అలాగే, జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతంలోని ఎస్‌బీఐ లోకల్ చెక్ ప్రోసెసింగ్ సెల్‌లో పనిచేస్తున్న క్యాష్ ఆఫీసర్‌కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో బ్యాంకు బ్రాంచీని వారం రోజులపాటు మూసివేశారు. అంధేరీలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ తోటమాలికి వైరస్ సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా బ్యాంకును తాత్కాలికంగా మూసివేశారు.
Corona Virus
Mumbai
SBI

More Telugu News