GHMC: తెలంగాణలో కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు... జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ తీవ్రం

Corona cases raises in GHMC area
  • హైదరాబాద్, పరిసరాల్లో 195 కేసులు
  • తాజాగా ముగ్గురి మృతి
  • ఇప్పటివరకు 2,377 డిశ్చార్జి
తెలంగాణలో కరోనా రక్కసి వేగంగా వ్యాపిస్తోంది. గడచిన 24 గంటల్లో 237 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 195 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇక ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 4,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 2,412 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనాతో ముగ్గురు చనిపోవడంతో, రాష్ట్రంలో మరణాల సంఖ్య 185కి పెరిగింది. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్త కేసులేమీ వెల్లడి కాలేదు.
GHMC
Hyderabad
Telangana
Corona Virus
Positive Cases

More Telugu News