Police: సుశాంత్ రాజ్ పుత్ ఆర్నెల్లుగా డిప్రెషన్ లో ఉన్నాడు: పోలీసులు

Police says Sushant has been in depression since six months
  • సుశాంత్ మరణంపై పోలీసులకు సమాచారం అందించిన సేవకుడు
  • సుశాంత్ గదిలో సూసైడ్ నోట్ లభించలేదన్న పోలీసులు
  • సుశాంత్ వాడుతున్న మందులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై పోలీసులు స్పందించారు. సుశాంత్ గదిలో సూసైడ్ లెటర్ లభించలేదని వెల్లడించారు. అయితే, సుశాంత్ గత ఆర్నెల్లుగా డిప్రెషన్ లో ఉన్నట్టు అర్థమవుతోందని, అతని గదిలో డిప్రెషన్ కు వాడే మందులు లభించాయని తెలిపారు.

ఈ మధ్యాహ్నం తన గదిలో విగతజీవుడిలా ఫ్యాన్ కు వేలాడుతున్న స్థితిలో సుశాంత్ రాజ్ పుత్ కనిపించాడు. సుశాంత్ ఇంట్లో సేవకుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఈ విషయం వెల్లడైంది.
Police
Sushant Singh Rajput
Suicide
Mumbai
Bollywood

More Telugu News