Bajireddy Govardhan: నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా పాజిటివ్

MLA Bajireddy Govardhan tested corona positive
  • తెలంగాణలో కరోనా బారినపడిన మరో ప్రజాప్రతినిధి
  • చికిత్స కోసం హైదరాబాదు బయల్దేరిన బాజిరెడ్డి
  • ఇంతకుముందు జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా
తెలంగాణలో కరోనా రక్కసి ప్రజాప్రతినిధులను కూడా వదలడంలేదు. తాజాగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా బారినపడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన చికిత్స కోసం హైదరాబాదు బయల్దేరారు.

ఎమ్మెల్యేకి కరోనా నిర్ధారణ కావడంతో ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో కరోనా సోకిన రెండో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఇంతకుముందు జనగాం శాసనసభ్యుడు ముత్తిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
Bajireddy Govardhan
Corona Virus
Positive
Nizamabad Rural

More Telugu News