Viral Videos: హృదయాన్ని ద్రవింపజేస్తూ నెటిజన్లతో కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో!

Teammates help 16 year old dead boy score one last goal
  • మెక్సికోలో ఘటన
  • ప్రాణాలు కోల్పోయిన ఫుట్‌బాల్ ఆటగాడు
  • మైదానంలో చివరిసారిగా శవపేటిక
  • శవపేటికను తాకేలా ఫుట్‌బాల్‌ను తన్నిన స్నేహితులు
  • నేరుగా గోల్‌లోకి వెళ్లిన బాల్
ఫుట్‌బాల్‌ ఆటే ప్రాణంగా బతికిన ఓ కుర్రాడు మృతి చెందాడు. దీంతో అతడి స్నేహితులు శవపేటికలో అతడి మృతదేహాన్ని తీసుకొచ్చి మైదానంలోనే కాసేపు పెట్టారు.  గోల్ఫ్‌కు ఎదురుగా శవపేటికను పెట్టి ఒకరు ఫుట్‌బాల్‌ను కిక్‌ చేయగా అది శవపేటికకు తగిలింది. అంతే అది నేరుగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది.

ఫుట్‌బాల్‌ అంటే ప్రాణంగా బతికిన ఆ కుర్రాడి మృతదేహం ఉన్న శవపేటికను తాకినా ఆ బాల్ ‌గోల్‌పోస్ట్‌కి వెళ్లడంతో అతడి స్నేహితులు కన్నీరు ఆపుకోలేకపోయారు. శవపేటిక చుట్టూ చేరి ఏడ్చాశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

నెటిజన్లతోనూ ఈ వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. అతడు చివరి గోల్‌ వేశాడని కామెంట్లు చేస్తున్నారు.  మెక్సికోలో ఈ ఘటన చోటు చేసుకుంది 16 ఏళ్ల ఫుట్‌బాల్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ మార్టినేజ్‌ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
                         
Viral Videos
Mexico
foot ball

More Telugu News