Chiranjeevi: నా జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన సమయమది: వీడియో పోస్ట్ చేసిన చిరంజీవి

share the most satisfying moments of my life
  • ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా చిరు పోస్ట్
  • జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఏముంటుంది
  • దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను
తన జీవితంలో తనకు అత్యంత సంతృప్తినిచ్చిన సమయమది అంటూ సినీనటుడు చిరంజీవి ఓ వీడియో పోస్ట్ చేశారు. గతంలో తాను రక్తదానం చేసిన వీడియోలను ఆయన ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ రోజు పోస్ట్ చేశారు.

ఒకరి జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఏముంటుందని చిరంజీవి ప్రశ్నించారు. ఎక్కడైనా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని, ప్రజలు రక్తదానం చేస్తున్నారని తాను తెలుసుకున్న ప్రతిసారి తాను ఇందుకుగానూ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతానని, రక్తదానం చేసే శక్తిని ఆయన ఇచ్చాడని చెప్పారు. కాగా, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా చిరంజీవి తన సేవలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే.
Chiranjeevi
Tollywood
Viral Videos

More Telugu News