Teja: మన దేశంలో రోజుకి లక్ష కరోనా కేసులు నమోదవుతాయి: వీడియోలో దర్శకుడు తేజ ఆవేదన

Director Teja shocking comments on Indians attitude
  • ఇండియా నంబర్‌ 1 వరస్ట్ పొజిషన్‌లోకి వెళ్లి పోతుంది
  • భారతీయుల తీరు ఇలాగే ఉంది
  • మన చుట్టూ ఉన్న వారికి కరోనా లేదని అనుకుంటున్నాము
  • కూరగాయలు కొన్న తర్వాత శానిటైజ్‌ చేయండి 
భారతీయుల తీరు చూస్తుంటే దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టమవుతుందని సినీ దర్శకుడు తేజ అన్నారు. ప్రతిరోజు దేశంలో వేల సంఖ్యలో పెరిగిపోతోన్న కరోనా కేసులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడారు. 'ఇప్పుడు ప్రతి రోజు 11 లేదా 12 వేల కేసులు నమోదవుతున్నాయి. రోజుకి లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇండియా నంబర్‌ 1 వరస్ట్ పొజిషన్‌లోకి వెళ్లి పోతుంది' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

'భారతీయుల తీరు ఇలాగే ఉంది. మన చుట్టూ ఉన్న వారికి కరోనా లేదని అనుకుంటున్నాము. మన స్నేహితులని, కూరగాయలు అమ్మే వారికి కరోనా లేదు కదా నాకు కూడా రాదు అని అనుకుంటున్నారు. నాకు కరోనా రాదు అనే భావనలో ఉన్నారు. కానీ, అందరిలోనూ కరోనా ఉందనే భావనతో వ్యవహరించండి. అలాంటప్పుడే కరోనాకు దూరంగా ఉండొచ్చు. కూరగాయలు కొన్న తర్వాత శానిటైజ్‌ చేయండి. సూపర్‌ మార్కెట్లో బిల్‌ కట్టి తిరిగి కార్డు తీసుకున్న తర్వాత శానిటైజ్ చేయండి' అని తేజ చెప్పారు.
  
Teja
Tollywood
Corona Virus

More Telugu News