Kala Venkata Rao: సభ్యుల హక్కులను హరించిన చర్యలను సమర్థించడం స్పీకర్ కు తగదు: కళా వెంకట్రావు

Kala Venkata Rao responds on Speaker Tammineni comments
  • అచ్చెన్న అరెస్ట్ పై టీడీపీ నేతల ఆగ్రహం
  • అచ్చెన్న అరెస్ట్ ప్రక్రియలో లోపాల్లేవన్న స్పీకర్
  • సభ్యుల హక్కులు కాపాడడం స్పీకర్ విధి అంటూ కళా హితవు
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడ్ని ఆరోగ్యం బాగాలేకున్నా, దారుణమైన రీతిలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటూ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడి ప్రస్తుత పరిస్థితిని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకుల్లో ఆగ్రహావేశాలు రగిల్చాయి.

అచ్చెన్నాయుడు అరెస్ట్ ప్రక్రియలో ఎలాంటి విధానపరమైన లోపాలు లేవని తమ్మినేని పేర్కొన్నారు. అయితే, పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి వారం రోజుల విశ్రాంతి అవసరమైన నేపథ్యంలో అచ్చెన్న అరెస్ట్ కక్షసాధింపు చర్యేనని టీడీపీ అంటోంది. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు. సభ్యుల హక్కులు కాపాడడం అసెంబ్లీ స్పీకర్ విధి అని స్పష్టం చేశారు. సభ్యుల హక్కులను హరించిన చర్యలను సమర్థించడం సరికాదు అని హితవు పలికారు.
Kala Venkata Rao
Tammineni Sitaram
Atchannaidu
Arrest
ACB
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News