Inter: ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నాం: తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడి

Telangana Intermediate Board says ready to release Inter results
  • ఈసారి పొరబాట్లు జరగవంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి
  • రేపు సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని వెల్లడి
  • ఆదేశాలు వస్తే ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తామని వివరణ
గతేడాది తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎంతటి తీవ్ర పరిణామాలు సృష్టించాయో తెలిసిందే. ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కావని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు చెబుతోంది. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఫలితాలపై రేపు సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తామని వివరించారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని జలీల్ పేర్కొన్నారు.
Inter
Telangana
Results
Board

More Telugu News