CPM Madhu: తెలంగాణలో ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు..  ఏపీలో ఆలస్యమైంది: ఈఎస్ఐ స్కాంపై సీపీఎం నేత మధు

Political interference should not be there in ESI case says CPM Madhu
  • ఈఎస్ఐ స్కాంకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి
  • చట్టం తన పని తాను చేసుకుపోతుంది
  • ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదు
ఈఎస్ఐ కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీపీఎం నేత మధు అన్నారు. ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగిందని, స్కామ్ కు సంబంధించి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో చోటు చేసుకున్న ఈఎస్ఐ స్కామ్ లో బాధ్యులు ఇప్పటికే శిక్షను అనుభవిస్తున్నారని అన్నారు. ఏపీలో కొంచెం ఆలస్యమైందని చెప్పారు.

ఇక్కడ కూడా విచారణ జరిపిన తర్వాతే అరెస్ట్ చేయడం జరిగిందని... అచ్చెన్నాయుడు ఇచ్చిన లేఖ ఆధారంగానే అరెస్టులు జరిగాయని తెలిపారు. అయితే, విచారణ సక్రమంగా జరగాలని... ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదని చెప్పారు.
CPM Madhu
ESI Scam
Atchannaidu
Telugudesam

More Telugu News