Poonam Kaur: మంచివాళ్లకు మనం ఎందుకు ఓట్లు వేయడం లేదు?: పూనమ్ కౌర్

Poonam Kaur asks why do we fail who are not corrupted
  • అవినీతి అంశంపై సోషల్ మీడియాలో పూనమ్ వ్యాఖ్యలు
  • అవినీతి రహితులు నేతలుగా పనికిరారా? అంటూ ఆవేదన
  • తన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ ట్వీట్
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్  అవినీతి అనే అంశంపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అవినీతి గురించి కొందరు చెప్పిన అభిప్రాయాలు బాగానే ఉన్నాయని, అయితే, మనకందరికీ ఇన్ని విషయాలు తెలిసి కూడా అవినీతి రహితులకు ఎందుకు ఓట్లు వేయలేకపోతున్నామని పూనమ్ ఆవేదన వెలిబుచ్చారు. "నాకు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏం, అవినీతి మచ్చలేని వ్యక్తులు మనకు నేతలుగా పనికిరారా? సమాధానం చెప్పండీ! దేశం మొత్తాన్ని అడుగుతున్నాను. అవినీతికి పాల్పడని నేతలను మనం ఎందుకు గెలిపించడంలేదు? మంచివాళ్లు రాజకీయాల్లో నెగ్గలేకపోతున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి" అంటూ ట్విట్టర్ లో స్పందించారు.
Poonam Kaur
Corruption
Politics
Leaders

More Telugu News