Corona Virus: మరో 186 మంది ఏపీ వాసులకు కరోనా నిర్ధారణ

186 more coronavirus cases in ap
  • గత 24 గంటల్లో 14,477 శాంపిళ్ల పరీక్ష 
  • మొత్తం కరోనా కేసులు 4,588
  • ఆసుపత్రుల్లో కరోనాకు 1,865 మందికి చికిత్స
  • ఇప్పటివరకు 2,641మంది డిశ్చార్జ్  
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 14,477 శాంపిళ్లను పరీక్షించగా మరో 186 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,588 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,865 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,641 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 82కి చేరింది.
             
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News