Chandrababu: కాసేపట్లో అమరావతికి చంద్రబాబు.. ఆసుపత్రిలో అచ్చెన్నాయుడిని కలవనున్న టీడీపీ అధినేత

chandrababu to reach amaravati
  • గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడికి చికిత్స
  • ఆపరేషన్‌ గాయం పచ్చిగా అయిన వైనం
  • జైళ్ల శాఖ డీజీని అనుమతి కోరిన చంద్రబాబు
తమ పార్టీ నేత అచ్చెన్నాయుడి అరెస్టు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేని దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ నుంచి అమరావతి బయలుదేరారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇటీవల జరిగిన ఆపరేషన్‌ గాయం పచ్చిగా మారిందని వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడిని చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. అంతకుముందు జైలు సూపరింటెండెంట్‌, జైళ్ల శాఖ డీజీని చంద్రబాబు నాయుడు ఈ మేరకు అనుమతి కోరారు. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు.
Chandrababu
Telugudesam
Amaravati

More Telugu News