Jagan: అచ్చెన్నాయుడు కోరుకున్న చోట వైద్య సాయం అందించండి: జగన్ ఆదేశాలు

Jagan enquires about health of Atchannaidu
  • అచ్చెన్న ఆరోగ్యంపై ఆరా తీసిన జగన్
  • మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అధికారులతో ఆరా
  • ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో ఉన్న అచ్చెన్న
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గుంటూరు ఆసుపత్రికి తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

 ఇదిలావుంచితే, అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. అచ్చెన్న ఆరోగ్యం గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్న కోరుకున్న చోట ఆయనకు వైద్య సహాయం అందించాలని ఏసీబీ అధికారులను జగన్ ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం.
Jagan
YSRCP
Atchannaidu
Telugudesam
Health

More Telugu News