Telangana: స్వీయ గృహ నిర్బంధంలోకి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

Telangana minister Harish Rao in self quarantine
  • సిద్ధిపేటలోని మంత్రి పీఏకు కరోనా పాజిటివ్ 
  • హరీశ్‌ సహా 17 మందికి కరోనా నెగటివ్
  • ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా సోకిన వార్త తెలిసిన మర్నాడే సిద్ధిపేటలోని మంత్రి పీఏకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు.

 అయితే, ఈ ఫలితాల్లో మంత్రి సహా 17 మందికి నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Telangana
Harish Rao
Corona Virus

More Telugu News