Atchannaidu: ఏం జరుగుతుందో చూద్దామన్న అచ్చెన్నాయుడు.. లాయర్లకు అడ్డుచెప్పిన పోలీసులు

Let us see what is going to happen says Atchannaidu
  • విజయవాడ ఏసీబీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు
  • ఇంత వరకు అధికారులు ప్రశ్నించలేదన్న అచ్చెన్న
  • అచ్చెన్నాయుడి సంతకాలు తీసుకునేందుకు వచ్చిన లాయర్లు
ఈఎస్ఐ మందుల కొనుగోలు కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి రోడ్డు మార్గంలో ఆయనను తరలించిన అధికారులు... విజయవాడలోని గొల్లపూడి ఆఫీసులో ఉంచారు. ఏసీబీ కార్యాలయంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, అధికారులు ఇంత వరకు తనను ప్రశ్నించ లేదని చెప్పారు. ఆఫీసు లోపలకు వెళ్తున్నానని... ఏం జరుగుతుందో చూద్దామని అన్నారు.

మరోవైపు ఏసీబీ ఆఫీసుకు అచ్చెన్నాయుడును తీసుకొచ్చే లోపలే... ఆయన తరపు న్యాయవాదులు అక్కడకు చేరుకున్నారు. అచ్చెన్నాయుడు సంతకాలు తీసుకోవడానికి వచ్చామని ఈ సందర్భంగా వారు చెప్పారు. అయితే, సంతకాలు తీసుకుంటున్న సమయంలో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైనా సరే కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు.
Atchannaidu
Telugudesam
ACB
Vijayawada

More Telugu News