Hyderabad: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం.. 15 మందికి పాజిటివ్!

8 more of Banjara Hills PS police tested corona positive
  • హైదరాబాద్ పోలీసులపై కరోనా ప్రభావం
  • బంజారాహిల్స్ పీఎస్ లో నిన్న ఏడుగురికి కరోనా
  • ఈరోజు మరో 8 మందికి కరోనా నిర్ధారణ
హైదరాబాద్ సిటీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో అధిక భాగం ఇక్కడే నమోదవుతున్నాయి. మరోవైపు నగర పోలీసులను కరోనా వణికిస్తోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆ సంఖ్య 15కు చేరింది. అంటే మరో 8 మందికి సోకింది. గత మూడు రోజుల నుంచి జరుపుతున్న పరీక్షల్లో కేసులు బయటపడుతున్నాయి. దీంతో పోలీసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు తగు చర్యలు చేపడుతున్నారు. పోలీస్ స్టేషన్ ను శానిటైజ్ చేశారు.
Hyderabad
Police
Banjara Hills
Corona Virus

More Telugu News