Corona Virus: ఏపీలో మరో 141 మందికి సోకిన కరోనా

- గత 24 గంటల్లో 11,775 శాంపిళ్ల పరీక్ష
- మొత్తం కరోనా కేసులు 4,402
- ఆసుపత్రుల్లో 1,723 మందికి చికిత్స
- 2,599 మంది డిశ్చార్జ్
ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్-19 కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 11,775 శాంపిళ్లను పరీక్షించగా మరో 141 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,402 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,723 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,599 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది.
