Harish Rao: హరీశ్ రావు పీఏకు కరోనా.. తెలంగాణలో పంజా విసురుతున్న మహమ్మారి!

Harish Rao PA tested Corona positive
  • తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా
  • హరీశ్ రావు సిద్దిపేట పీఏకు కరోనా
  • అప్రమత్తమైన అధికార యంత్రాంగం
లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతిరోజు దాదాపు  200 కొత్త కేసులతో కలకలం రేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్ కు కరోనా సోకిందనే వార్త వచ్చి ఒక్క రోజు కూడా గడవక ముందే ఈరోజు మరో వార్త షాకిస్తోంది.

మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పీఏకు కరోనా సోకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ప్రజాప్రతినిధుల వద్ద పని చేస్తున్న సిబ్బందికి కూడా కరోనా సోకుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందిస్తోంది.
Harish Rao
TRS
PA
Corona Virus

More Telugu News