Chandrababu: అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో ఫోనులో మాట్లాడిన చంద్రబాబు, లోకేశ్

chandrababu calls achannidu family
  • కనీస సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారన్న కుటుంబ సభ్యులు
  • తమతో మాట్లాడేందుకు కూడా ఛాన్స్ ఇవ్వలేదని వ్యాఖ్య
  • తమ పార్టీ అండగా ఉంటుందన్న చంద్రబాబు, లోకేశ్  
టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో ఫోనులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్ మాట్లాడారు. తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అచ్చెన్నాయుడిని తీసుకెళ్లారని చంద్రబాబుకు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ సమయంలో తమతో మాట్లాడేందుకు కూడా అచ్చెన్నాయుడికి అధికారులు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పారు. అరెస్టు నేపథ్యంలో అచ్చెన్నాయుడి కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు, లోకేశ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని, దీన్నిబట్టి అధికారులపై ప్రభుత్వం నుంచి ఎంతగా ఒత్తిడి ఉందో అర్థమయిందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
Chandrababu
Nara Lokesh
Atchannaidu

More Telugu News