Vijaya Madhuri: నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పిన అచ్చెన్నాయుడి భార్య విజయ మాధురి!

Acchamnaidu Wife Vijaya Madhuri Reveals What Happened Last Night
  • మా ఇంటిని చుట్టుముట్టారు
  • తన భర్తకు సర్జరీ జరిగిందన్నా వినలేదు
  • రాత్రంతా నిద్రపోనివ్వలేదన్న విజయ మాధురి
నిన్న రాత్రి 7.30 గంటలకే తమ ఇంటిని చుట్టుముట్టిన కొందరు, తాము ఏసీబీ అధికారులమంటూ ఇంట్లోకి వచ్చారని, తమకు ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితుల్లోనే రాత్రంగా గడచిపోయిందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి భార్య విజయ మాధురి వ్యాఖ్యానించారు.

ఉదయం తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన భర్తకు ఇటీవలే సర్జరీ జరిగిందని గుర్తు చేశారు. రాత్రంతా తన భర్తను నిద్రపోనివ్వలేదని, ఇల్లంతా సోదాలు చేశారని, కొన్ని వస్తువులను నాశనం చేశారని ఆమె ఆరోపించారు. అర్ధరాత్రి తరువాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారని, ఆపై తామెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లిపోయారని అన్నారు. తన భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే, ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు.
Vijaya Madhuri
Kinjarapu Acchamnaidu
Arrest

More Telugu News