Chandrababu: అందుకే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు: చంద్రబాబు నాయుడు

chandrababu fires on ap govt
  • ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు
  • సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి
  • అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి అరెస్టు
  • ఇలా చేయడం జగన్‌ కుట్రలో భాగం
గతంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఈ రోజు ఉదయం అవినీతి నిరోధకశాఖ  అధికారులు అరెస్టు చేసిన ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో, ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా తెలియదని అన్నారు.

ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు. దీనిపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం జగన్‌ కుట్రలో భాగమని చెప్పారు. ఫోనులో మాట్లాడదామనుకుంటున్నప్పటికీ ఆయనను అందుబాటులో లేకుండా చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News