Devineni Uma: ఆ దమ్ము, ధైర్యం మీకున్నాయా వైఎస్‌ జగన్ గారు?: దేవినేని ఉమ

devineni fires on ycp
  • రూ.6 లక్షల కోట్ల అవినీతికి సాక్ష్యాధారాలున్నాయన్నారు
  • తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకొచ్చారు
  • చంద్రన్న కానుకలు ఆపారు
  • ఈ రోజు మజ్జిగ, నెయ్యి మీద విచారణ అంటున్నారు
తమ పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోన్న చర్యలపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'ఎన్నికల ముందు ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతికి సాక్ష్యాధారాలున్నాయని తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకొచ్చారు. చంద్రన్న కానుకలు ఆపారు. ఈ రోజు మజ్జిగ, నెయ్యి మీద విచారణ అంటున్నారు. ఇది రాజకీయకక్ష సాధింపు కాదా? ఏడాదిలో వైను, మైను, ల్యాండ్, శాండ్ దోపిడీపై సీబీఐ విచారణకిచ్చే దమ్ము, ధైర్యం మీకున్నాయా వైఎస్‌ జగన్ గారు?' అని ఆయన ట్వీట్ చేశారు.

కాగా, ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని నిలబెట్టడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ప్రజలకు రాసిన లేఖకు సంబంధించిన వార్తలను దేవినేని ఉమ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్ని దాడులు, దౌర్జన్యాలు చేసినా రాజీలేని పోరాటం చేస్తామని, ప్రజల ప్రాథమిక హక్కులు, చట్టపాలనను నిలబెట్టడానికి ఎంతవరకైనా వెళ్లి పోరాడతామని చంద్రబాబు అన్నారు.

Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News