Kinjarapu Acchamnaidu: అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారు... ఏం జరిగినా జగన్ దే బాధ్యత: చంద్రబాబు నిప్పులు

Chandra babu Angry Over Acchamnaidu arrest
  • అచ్చెన్నాయుడు ఎక్కడున్నారు?
  • డీజీపీ మీడియాకు వెంటనే చెప్పాల్సిందే
  • రాత్రి పూట దాడులపై చంద్రబాబు ఆగ్రహం
తమ పార్టీ నేత అచ్చెన్నాయుడిని బలవంతంగా కిడ్నాప్ చేశారని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే బాధ్యతని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ తెల్లవారుజామున అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, ఆయన్ను విజయవాడకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, వెంటనే తనకు అందుబాటులో ఉన్న నేతలతో మాట్లాడారు. అసెంబ్లీలో ఉపనేతగా ఉన్న ఆయన్ను, విచారించాలని భావిస్తే, చట్టపరమైన మార్గాల్లో ముందుకు వెళ్లాలే తప్ప, ఇలా రాత్రిపూట దాడులకు దిగడమేంటని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తక్షణమే హోమ్ మంత్రి రాజీనామా చేయాలని, అచ్చెన్నాయుడు ఎక్కడున్నారో వెంటనే డీజీపీ మీడియాకు తెలియజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Kinjarapu Acchamnaidu
Chandrababu
Jagan

More Telugu News