Maharashtra: మహారాష్ట్రలో ఒక్క రోజే 149 మంది మృతి

corona fears in Maharashtra people deaths reached to 35 thousand
  • మహారాష్ట్రలో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • నిన్న ఒక్క రోజే 3,254 కేసుల నమోదు
  • 3500కు చేరువలో మరణాలు
మహారాష్ట్రలో కరోనా వైరస్ మరణాలు కలవర పెడుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఏకంగా 149 మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,438 మరణాలు నమోదయ్యాయి. ఇక, నిన్న 3,254 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 94,041కు చేరుకుంది. అలాగే, నిన్న 1,879 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,517కి పెరిగింది.  

Maharashtra
Corona Virus
corona deaths

More Telugu News